విక్రమ్ సినిమా కోసం కష్టపడుతున్న అఖిల్ !

విక్రమ్ సినిమా కోసం కష్టపడుతున్న అఖిల్ !

Published on Jan 7, 2017 12:02 PM IST

akhil
యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన మొదటి సినిమా ‘అఖిల్’ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తన తరువాతి సినిమాకి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని తన తమ కుటుంబానికి ‘మనం’ వంటి మర్చిపోలేని క్లాసికల్ హిట్ అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ తో సినిమాకి సైన్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అఖిల్ ను మొదటిసారిగా స్క్రీన్ మీద చూపించింది విక్రమ్ కుమారే. ఈ సినిమాపైనే అఖిల్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

అందుకే సినిమా కోసం అన్ని విధాలుగా కష్టపడుతూ జిమ్ లో బాడీ బిల్డప్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ విషయాన్నే అఖిల్ తెలుపుతూ ‘ ఈరోజు నుండి కొత్త వర్కవుట్స్, డైట్ మొదలుపెట్టాను. ఇది కొత్త సినిమా కోసం ఫిట్ గా తయారవ్వాల్సిన సమయం. విక్రమ్ సినిమా నా బాడీ నుండి చాలా డిమాండ్ చేస్తోంది’ అంటూ వర్కవుట్స్ ఫోటోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.

తాజా వార్తలు