మీడియాకు థ్యాంక్స్ చెప్పిన జయసుధ !

మీడియాకు థ్యాంక్స్ చెప్పిన జయసుధ !

Published on Mar 17, 2017 12:10 PM IST

jayasudha
సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య సినీ పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెల్సిందే. గత కొన్ని రోజులుగా ముంబైలోని తన చెల్లెలి వద్ద ఉంటున్న నితిన్ కపూర్ మూడు రోజుల క్రితం తాను ఉంటున్న అపార్ట్మెంట్ ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అతంటి కష్ట కాలంలో మీడియా ఆ వార్తను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టు చూపి తన, తన కుటుంబ యొక్క వ్యక్తిగత విషయాలను డిస్టర్బ్ చేయనందుకు జయసుధ ఈరోజు పేస్ బుక్ ద్వారా మీడియాకు థ్యాంక్స్ చెప్పారు.

తన జీవితంలో జరిగిన ఈ దుర్ఘటనను పెద్ద సెన్సెస్షన్ చేయనందుకు తనను ఇబ్బందిపెట్టనందుకు ఆమె మీడియాను మెచ్చుకున్నారు. జయసుధ, నితిన్ కపూర్ లు 30 ఏళ్ల క్రితం వివాహం చేసుకోగా వారికి ఇద్దరు కుమారులున్నారు. గత కొన్నాళ్లుగా మానసిక సమస్యతో భాధపడుతున్న నితిన్ కపూర్ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాధమిక విచారణలో వెల్లడైంది.

తాజా వార్తలు