
హీరో గోపిచంద్, సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ కలయికలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. చిత్రీకరణ పూర్తై చాలా రోజులు కావొస్తున్నా విడుదలకు నోచుకోని ఈ చిత్రం ప్రస్తుతం రిలీజుకు సిద్ధమవుతోంది. అన్ని పనుల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా ముగించుకుంది.
సెన్సార్ బోర్డు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే చిత్రాన్ని జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని కూడా నిర్మయించారు. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఇది కాకుండా గోపిచంద్ డైరెక్షన్లో ‘గౌతమ్ నంద’, ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ‘ఆక్సిజన్’ సినిమాల్ని చేస్తున్నారు.

