
గతంలో శ్రద్ధా దాస్ దర్శకుడు ప్రవీణ్ సత్తూరు దర్శకత్వం లో నటించిన సమయం లో శ్రద్ధాదాస్ రోల్ పై అనేక విమర్శలు వినిపించాయి.కాగా మరోమారు శ్రద్దాదాస్ ప్రవీణ్ దర్శకత్వంలో నటిస్తోంది. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గరుడ వేగ చిత్రంలో శ్రద్ధాదాస్ నటిస్తోంది.
ఈ చిత్రంలో శ్రద్దా జర్నలిస్ట్ పాత్రలో నటించనుంది. ఆమె పాత్ర చిత్రంలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ హీరో గా కొంత గ్యాప్ తరువాత తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం బాగానే ఖర్చు చేస్తున్నారు. సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సన్నీ లియోన్ ఓ సాంగ్ లో మెరవనుంది.

