
‘బ్రూస్ లీ, ఆగడు, మిస్టర్’ వంటి వరుస పరాజయాలతో బాగా వెనుకబడ్డ దర్శకుడు శ్రీను వైట్ల రీ ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకదాని వెంట ఒకటిగా ఎదురైన ఫ్లాపులు ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆయన చేతిలో ఖహ్చితమైన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఇలాంటి తరుణంలో సినీ వర్గాల్లో ఒక వార్త తెగ హడావుడి చేస్తోంది.
అదేమిటంటే ఈ సినిమాలో సీనియర్ హీరో రవి తేజ శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు సిద్దమయ్యారట. గతంలో వీరిద్దరి కాంబోనేషన్లో వచ్చిన ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి హిట్ సినిమాలు రూపొందాయి. ఈ రిలేషన్ తోనే వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నారట. అధికారకంగా ఇంకా కన్ఫర్మ్ కానీ ఈ వార్త ఎంత వరకు నిజమో, మాస్ మహారాజ శ్రీను వైట్లతో సినిమా చేస్తాడో చేయడో చూడాలి మరి.

