గ్యాంగ్ లో రమ్య కృష్ణ పాత్ర ఇదేనా?

గ్యాంగ్ లో రమ్య కృష్ణ పాత్ర ఇదేనా?

Published on Jan 10, 2018 4:10 PM IST

gang2

యువ హీరోలకు తల్లిగా అత్తగా నటిస్తోన్న రమ్య కృష్ణ బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి మంచి పేరుతో పాటు గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రమ్య కృష్ణ కోలీవుడ్ సినిమా ‘గ్యాంగ్’ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లో రమ్యకృష్ణ లుక్స్ బాగున్నాయి.

తాజా సమాచారం మేరకు రమ్య కృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలిష్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. సూర్య, కీర్తి సురేష్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను వేగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో విగ్నేష్ శివన్ తమిళ్ లో దర్శకత్వం వహించిన ‘మద్రాస్, నాన్ రౌడి దాన్’ సినిమాలు మంచి విజయం సాధించాయి.

తాజా వార్తలు