‘తొలిప్రేమ’ రెండు రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్ల వివరాలు !

‘తొలిప్రేమ’ రెండు రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్ల వివరాలు !

Published on Feb 12, 2018 2:33 PM IST

tholi prema

వరుణ్ తేజ్, రాశీ ఖన్నాల ‘తొలిప్రేమ’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బలమైన కంటెంట్ తో, తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతోంది. నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం 2 రోజులకుగాను రూ. 18 కోట్ల గ్రాస్ ను, రూ.9.32 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలను అందుకునేలా కనిపిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక ఓవర్సీస్లో కూడా సినిమా ఆదివారం 1.3 లక్షల డాలర్లను వసూలు చేసి మొత్తంగా 6.5 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు.

తాజా వార్తలు