స్టార్ నటి శ్రీదేవి మృతికి సంబందించిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బయటికొచ్చాయి. పోస్టుమార్టం నిర్వహించిన అక్కడి వైద్యులు శ్రీదేవి మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి నీటిలో మునిగిపోవడంతో మరణించారని నివేదికలో తెలియపరిచారు.
ఈ నివేదికను అందుకున్న పోలీసులు ఆమె భౌతిక కాయాన్ని ఇండియా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబానీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆమెను ముంబై తీసుకురానున్నారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తై పార్థివ దేహం ఇండియాకు చేరుకోనేసరికి రాత్రి అవ్వోచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు శ్రీదేవికి నివాళులర్పించేందుకు ముంబైలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు.



