60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న లవర్ !

60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న లవర్ !

Published on Feb 27, 2018 7:14 PM IST

దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న సినిమా లవర్. అలా ఎలా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనీష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరిగింది. తాజాగా హైదరాబాద్ మెట్రో లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయ్యింది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ సినిమాలో మలయాళం నటి గాయత్రి సురేష్ నటించాల్సింది, కాని కొన్ని అనివార్య కారణాల వల్లఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రంగుల రాట్నం సినిమా తరువాత రాజ్ తరుణ్ నటించిన రాజుగాడు మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత లవర్ రానుంది. డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు