తమిళ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అమల పాల్ రొటీన్ కు భిన్నంగా చేసిన సినిమా ‘అదో అంధ పారవై పోల’. ఇన్నాళ్లు గ్లామర్ రోల్స్ లో మాత్రమే కనబడిన అమల పాల్ ఈ చిత్రంలో మాత్రం రఫ్ అండ్ టఫ్ లుక్లో కనిపించనుంది. పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు మహిళా దినోత్సవం సందర్బంగా విడుదలైంది.
కె.ఆర్.వినోత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అడవుల్లో తప్పిపోయిన మహిళ ఎలాంటి ఇబ్బందులపడింది. ధైర్యంగా వాటిని ఎదుర్కొని ఎలా బయటపడింది అనే అంశాల ఆధారంగా నడుస్తుందట. అందుకే ఎక్కువ భాగం వెస్ట్రన్ ఘాట్స్ అడవుల్లో చిత్రీకరించారట. ఇప్పటికే త్రిష, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు రొటీన్ సినిమాలు మానేసి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేస్తుండగా అమల పాల్ కూడా ‘అదో అంధ పారవై పోల’ చిత్రంతో వాళ్ళ సరసన చేరింది.


