స్టార్ హీరో కేసులో విచారణ ముమ్మరం !

స్టార్ హీరో కేసులో విచారణ ముమ్మరం !

Published on Mar 13, 2018 11:58 AM IST

మలయాళ స్టార్ హీరో దిలీప్ ప్రముఖ నటిని వేధించిన కేసులో ప్రధాన నిందితుడిగా గత ఏడాది జైలుకి వెళ్లి దాదాపు మూడు నెలల రిమాండ్ తర్వాత బెయిలుపై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేరళ హైకోర్టు ఈ నెల 14 అనగా రేపటి నుండి విచారణ చర్యలను ముమ్మరం చేయనుంది.

అయితే కేసులో ప్రధాన ఆధారాలుగా చెప్పబడుతున్న వీడియో క్లిప్స్ తనకు అందలేదని పిటిషన్ దాఖలు చేసి విచారణను కాస్త వాయిదావేయాలని దిలీప్ కోర్టును కోరగా ప్రాసిక్యూషన్ దీనికి అభ్యంతరం తెలిపింది. దీంతో ఎర్నాకులం ప్రిన్సిపాల్ సెషన్స్ కోర్టులో రేపటి నుండి విచారణ జరగనుంది. దిలీప్ తో పాటు నిందితులుగా పరిగణింపబడుతున్న ఇంకొంత మంది సైతం రేపు కోర్టు ఎదుట హాజరుకానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు