రాజేష్ కనపర్తి దర్శకత్వంలో, రేణుక నరేంద్ర నిర్మాతగా మాస్టర్ ఎన్ టి రామ్ చరణ్ సమర్పణలో సెవన్ వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కనున్న చిత్రం ‘డ్రీమ్ బాయ్’. తేజ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, మరో నిర్మాత ఏం వి రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ సన్నిధి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేష్ కనపర్తి మాట్లాడుతూ.. ఇదొక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ప్రేమతో నిండిన క్యూట్ స్టోరీ ఇది. అలాగే సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. కొత్త, పాత నటీనటులతో ఈ చిత్రాన్ని లావిష్ గా తెరకెక్కించనున్నాం. ఆద్యంతం కామెడీతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది..అన్నారు.
చిత్ర నిర్మాత రేణుక నరేంద్ర మాట్లాడుతూ.. మా డైరెక్టర్ రాజేష్ చెప్పిన కథ ఎంతో నచ్చింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పొందు పరచనున్నాం. ఈ చిత్రం మాకు, మా బ్యానర్ కు మంచి నేమ్ తెస్తుందని ఆశిస్తున్నాం.. అన్నారు.
తేజ, హరిణి రెడ్డి, ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, గౌతమ్ రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నాని, సంగీతం: సుభాష్ ఆనంద్, కో డైరెక్టర్: రాధా కృష్ణ, నిర్మాత: రేణుక నరేంద్ర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ కనపర్తి.
నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా ‘డ్రీమ్ బాయ్’ చిత్రం ప్రారంభం
నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా ‘డ్రీమ్ బాయ్’ చిత్రం ప్రారంభం
Published on Mar 13, 2018 10:00 AM IST
సంబంధిత సమాచారం
- నా ‘వారణాసి’కి ఇదే బలమైన ఫౌండేషన్ – రాజమౌళి కామెంట్స్ వైరల్
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కి ఆల్ సెట్.. ‘ఎవడు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా
- మెగా కోడలి కొత్త సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘మైఖేల్’ బయోపిక్.. అతడికే అన్ని ప్రశంసలూ..!
- ‘డార్లింగ్’ ర్యాంపేజ్.. 2 రోజుల్లో భారీ వసూళ్లు!
- NBK 111: నెవర్ బిఫోర్ రోల్ లో బాలయ్య!?
- ‘వారణాసి’ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్న జక్కన్న!
- మైఖేల్’ పార్ట్ 2 టైటిల్, రిలీజ్ టైం ఫిక్స్..? లెజెండరీ బయోపిక్ ముగింపు టైటిల్ ఇదేనా?
- ఆర్సీ పురంలో ఘనంగా ‘అనుటెక్స్’ నూతన షోరూమ్ ప్రారంభం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్
- ఆల్ టైం రికార్డ్స్ తో మొదలైన ‘డార్లింగ్’ వసూళ్లు!
- నితిన్ సరసన యంగ్ బ్యూటీ లాక్.. కెమిస్ట్రీ పైనే అందరి చూపులు..!
- SSR61 టైటిల్, టీజర్ వచ్చేస్తోంది..!
- యాడ్ తెచ్చిన ముచ్చట.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కుదిరేనా..?
- ‘రామాయణ’లో రావణ పాత్రే ఎందుకు? రాకింగ్ స్టార్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘బ్యాండ్ మేళం’


