తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కేవలం తెలుగుకి మాత్రానే పరిమితం కాకుండ మొదటి నుండి తమిళంలో కూడ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన పలు ప్రాజెక్ట్స్ అక్కడ ఆయనకు మంచి గుర్తింపును కూడ తెచ్చిపెట్టాయి. దీంతో ద్విభాషా చిత్రం అనగానే ఈ యువ హీరోనే గుర్తొస్తున్నాడు చాలా మంది దర్శకులకి.
తాజాగా ఈయన సంచలన దర్శకుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో చేస్తున్న ‘నరగసూరన్’ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రాన్ని మే నెల చివర్లో విడుదల చేస్తున్నట్లు కార్తిక్ నరేన్ తన ఫేస్ బుక్ ద్వారా హింట్ ఇచ్చారు. అవింద స్వామి, శ్రియ శరన్ లాంటి స్టార్ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతొ విడుదలచేయనున్నారు.


