ఇంప్రెస్ చేసిన ‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ !

ఇంప్రెస్ చేసిన ‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ !

Published on Mar 16, 2018 10:00 AM IST

యంగ్ హీరో శ్రీవిష్ణు చేసిన తాజా చిత్రం ‘నీది నాది ఒకే కథ’. పోస్టర్లు, టీజర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో యువతకు సంబందించిన బలమైన మెసేజ్ ఏదో ఉంటుందని, వాటితో పాటే మంచి ఫన్, ఎమోషన్ కూడ ఉంటాయని అనిపిస్తోంది.

ఇక హీరో శ్రీవిష్ణు అయితే నెల్లూరి యాసలో మాట్లాడుతూ చేసిన పెర్ఫార్మెన్స్ కొత్తగా ఉండి ఆకట్టుకుంది. ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవిష్ణు స్నేహితుడు, హీరో నారా రోహిత్ తన అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. మార్చి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

తాజా వార్తలు