రంగస్థలం సినిమా రన్ టైం కాస్త ఎక్కువగా ఉంటుందనే వార్తలు మొదటి నుండి ఉన్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైం 2 గంటల 59 నిమిషాలని తెలిసింది. సినిమాలో విషయం ఉంటే ఎంతసేపయినా ఆడియన్స్ చూస్తారని అర్జున్ రెడ్డి సినిమా నిరూపించింది. అదే కోవలోకి రంగస్థలం సినిమా రావచ్చని సమాచారం.
ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ అందరికి నచ్చాయి. సుకుమార్ తనదైన శైలిలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. సమంత నటన అనసూయ అభినయం సినిమాకు ప్లస్ కాబోతున్నాయని సమాచారం. ఆది పినిశెట్టి చరణ్ మద్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మర్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


