‘రంగస్థలం’ 3 రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్ల వివరాలు !

‘రంగస్థలం’ 3 రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్ల వివరాలు !

Published on Apr 2, 2018 5:20 PM IST


‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్లను రాబడుతోంది. కంటెంట్ ఉన్న సినిమాకి స్టార్ పవర్ తోడైతే ఆ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అనడానికి మంచి ఉదాహరణగా నిలుస్తోంది ‘రంగస్థలం’. మొదటి రెండు రోజులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 28.57 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా 3వ రోజు ఆదివారం కూడ అదే స్థాయి పెర్ఫార్మన్స్ చూపి రూ. 36 కోట్లకు పైగానే షేర్ ను ఖాతాలో వేసుకుంది.

అలాగే ఓవర్సీస్లో కూడ 3 రోజులకుగాను 2.4 మిలియన్ డార్లను కొల్లగొట్టిన ఈ చిత్రం త్వరలోనే 3 మిలియన్ మార్కును అందుకోనుంది. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటకలో రూ.4.8 కోట్ల షేర్ ను అందుకున్న ఈ సినిమా ప్రపంవ్యాప్తంగా రూ.50 కోట్ల పైగానే షేర్ ను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు త్వరలోనే లాభదాయకమైన సినిమాగా మారనుంది. ఈరోజు జరిగిన థ్యాంక్స్ మీట్లో కూడ నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పుడున్న రన్ చూస్తుంటే సినిమా కొత్త రికార్డుల్ని క్రియేట్ ఖాయంగా అనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు