వరుణ్ తేజ్ కొత్త సినిమా విశేషాలు !

వరుణ్ తేజ్ కొత్త సినిమా విశేషాలు !

Published on Apr 3, 2018 12:00 PM IST

వరుణ్ తేజ్ తో విభిన్నమైన కథాంశం తో సినిమా చేయ్యబోతున్నాడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. ఏప్రిల్ మూడో వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ హైదారాబాద్ లోని ఒక స్టుడియోలో జరగబోతోంది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఈ సినిమా కోసం విభిన్నమైన సెట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అదితి రావ్ హైదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ మూవీలో నటించే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సాగర్ చంద్ర సినిమా కూడ చెయ్యబోతునాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు