నిఖిల్ నటించిన తాజా సినిమా కిరాక్ పార్టి ఇటీవలే విడుదల అయ్యింది. తాజాగా నిఖిల్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘కనితన్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో నిఖిల్ ఒక రిపోర్టర్ గా నటించబోతున్నాడు. కనితన్ ఒరిజినల్ వెర్షన్ తీసిన టిఎన్ సంతోష్ తెలుగుకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
మొదట ఈ సినిమాకు సెంధిల్ కెమెరామెన్ గా పని చెయ్యాలి. సేందిల్ తో చిత్ర యూనిట్ మంతనాలు కూడా జరిపారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్థామలో కొత్త కెమెరామెన్ సూర్య తేజ్ వచ్చాడు. సూర్య తేజ్ గతంలో ప్రసాద్ మురెళ్ళ దగ్గర చాలా సినిమాలకు వర్క్ చెయ్యడం జరిగింది. కనితన్ సినిమాలో నటించే హీరోయిన్ వివరాలు త్వరలో తెలియనున్నాయి.


