‘సాహో’ ఖరీదైన షెడ్యూల్ ఆరంభానికి డేట్ కుదిరింది !

‘సాహో’ ఖరీదైన షెడ్యూల్ ఆరంభానికి డేట్ కుదిరింది !

Published on Apr 4, 2018 5:26 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న నటిస్తున్న తాజ్ చిత్రం ‘సాహో’. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. అందుకే నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ కేటాయించి సినిమాను అన్ని విధాలా ఉన్నతంగా ఉండేలా రూపొందిస్తోంది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

ఇకపోతే సినిమాలోనే అత్యంత ఖరీదైన దుబాయ్ షెడ్యూల్ ఈ నెల 10నుండి మొదలుకానుంది. దీనికోసం ఇప్పటీకే సాంకేతిక్ నిపుణులు, నటీ నటులు దుబాయ్ చేరుకున్నారు. హెవీ యాక్షన్ సన్నివేశాలు కలిగిన ఈ షెడ్యూల్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో జరగనుంది. అబుదాబిలోని బుర్జ్ ఖలీఫా, ఇతిహాద్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, రస్ అల్ కైమ వంటి లొకేషన్లో షూట్ జరపనున్నారు చిత్ర టీమ్.

తాజా వార్తలు