
రామ్ చరణ్ , సుకుమార్ ల ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. నాలుగో వారంలో కూడ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో వసూళ్లు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ మొదటి 17 రోజుల్లోనే చిత్రం రూ.24కోట్ల షేర్ ను రాబట్టుకుంది.
ఇప్పటికీ హైదరాబాద్ నగరంలోని పలు మల్టీప్లెక్స్ థియేటర్లు దాదాపు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అందుకే సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ రేపటి నుండి నగరంలో 18 షోలను అధికంగా వేయనుంది. దీంతో సినిమా వసూళ్లు ఇంకాస్త మెరుగుపడే అవకాశాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే ఉత్తమమైన వసూళ్లను సాధించిన చిత్రంగా నిలబడింది.

