ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్డేట్ !

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్డేట్ !

Published on Apr 28, 2018 9:24 AM IST


తారక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి విధితమే. ఇటీవలే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్ర షూటింగ్ మొదలైంది. యాక్షన్ సీక్వెన్సులతో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడ ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు.

తర్వాతి షెడ్యూల్ మే నెల ఆరంభంలో మొదలుకానుంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటిసారి తారక్, త్రివిక్రమ్ లు కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు