
ఇటీవలే ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన హీరో నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చండీగఢ్ లో జరుగుతోంది. ఇందులో నితిన్ ఆర్కిటెక్ట్ గా కనిపించబోతున్నాడట. అందుకే అందమైన కట్టడాలు కలిగిన చండీగఢ్ నగరంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .
జాతీయ అవార్డు దక్కించుకున్న చిత్రం ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాశీఖన్నా, నందిత శ్వేతలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మీకీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

