యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ సినిమా కోసం బరువు బాగా తగ్గించి కొత్త మేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేకోవర్ కోసం తారక్ ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ వద్ద కొన్ని నెలలపాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఎన్టీఆర్ డెడికేషన్ పట్ల స్టీవెన్స్ కూడ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసి సినిమాలో కొత్త ఎన్టీఆర్ ను చూస్తారంటూ హామీ ఇచ్చారు.
ఈ చిత్రం తరవాత తారక్ రాజమౌళి రూపొందించనున్న భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే ఒక కొత్త మేకోవర్ లోకి మారిన తారక్ జక్కన్న సినిమాకి ఇంకో కొత్త లుక్ ట్రై చేయనున్నారు. దాని కోసం కూడ ట్రైనర్ గా స్టీవెన్ నే తీసుకున్నారు తారక్. త్రివిక్రమ్ సినిమా పూర్తవగానే స్టీవెన్ ఇండియాకు తిరిగొచ్చి ఎన్టీఆర్ కు ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెట్టనున్నారు. ఇలా ఎన్టీఆర్ రెండు వరుస సినిమాలకు వెంట వెంటనే రెండు కొత్త లుక్స్ ట్రై చేయడం నిజంగా అభినందించదగిన విషయం.


