175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం : పవన్ కళ్యాణ్

175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం : పవన్ కళ్యాణ్

Published on May 1, 2018 4:54 PM IST

Pawan Kalyan
స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో తన వ్యూహమేమిటో స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన జనసేన పార్టీ 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఖచ్చితమైన ప్రణాళికతో బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అడుగులువేయాలని ఆయన పార్టీ క్యాడర్ కు సూచించారు.

ఈరోజు పలు జిల్లా ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన ఆయన పార్టీ ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా దేవ్ ను పరిచయం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న దేవ్ 2019 ఎన్నికల స్ట్రాటజీని రూపొందించనున్నారని, ఆయనకు కొన్నేళ్ల క్రితం తాను ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి 1200 మంది సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు.

అలాగే అందరూ కులాల, మతాల సామరస్యతను కాపాడుకుంటూ పనిచేయాలని, ఈ నెల 11లోపు హోదా సాధనపై తన పర్యటన యొక్క పూర్తిస్థాయి వివరాలను వెల్లడిస్తానని, వివరాలను వెల్లడించిన 48 గంటల్లో ప్రజల మధ్యలో ఉంటానని పవన్ ప్రకటించారు.

తాజా వార్తలు