సగం షూట్ పూర్తిచేసుకున్న విజయ్ సినిమా !

సగం షూట్ పూర్తిచేసుకున్న విజయ్ సినిమా !

Published on May 2, 2018 6:19 PM IST

తమిల్ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ ల కలయికలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘తుపాకీ, కత్తి’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఈ ప్రాజెక్ట్ పై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇన్నాళ్లు తమిళనాట జరిగిన నిర్మాతల మండలి నిరసన మూలాన ఆగిపోయిన ఈ చిత్ర రెండవ షెడ్యూల్ కొద్దిరోజుల క్రితమే తిరిగి మొదలైంది.

చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ కూడ తాజాగా ముగింసింది. దీంతో 45 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. ఇకపోతే ఈ భారీ ప్రాజెక్ట్ సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ నిర్మిస్తుండగా కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది. అలాగే ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు