‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు !

‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు !

Published on May 3, 2018 5:54 PM IST

భారీ అంచనాల నడుమ రేపు విడుదలకానున్న అల్లు అర్జున్ చిత్రం ‘నా పేరు సూర్య’. బన్నీ గత చిత్రాలు మంచి విజయాల్ని సాధించి ఉండటంతో ఈ సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగింది. అందుకే చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది. ఈ మొత్తం వెనక్కి రావాలంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయాన్ని సాదించాల్సిందే.

అత్యధికంగా నైజామ్ ఏరియాలో రూ.21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వైజాగ్లో రూ.8 కోట్లు, సీడెడ్లో రూ.12 కోట్లు, యూఎస్లో రూ.7 కోట్లు, బెంగుళూరు రూ.9 కోట్లు, గుంటూరులో రూ.5.5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 5.4 కోట్లు, కృష్ణాలో రూ.5 కోట్లు, నెల్లూరులో రూ. 2.52 కోట్లు చేసింది.

రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బన్నీ కోపాన్ని అదుపుచేసుకోలేని ఆర్మీ అధికారిగా కనిపించనుండగా అను ఇమ్మాన్యుయేల్ ఆయనకు జోడీగా నటించారు.

తాజా వార్తలు