ప్రభాస్, రాజమౌళిల ‘బాహుబలి-2’ చిత్రం నిన్న మే 4వ తేదీన చైనాలో పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. చైనా సినీ ప్రేక్షకుల్లో మొదటి నుండి ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొని ఉండటంతో చిత్రానికి మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. 7000 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం సుమారు 2.85 మిలియన్ డాలర్లును కొల్లగొట్టి టాప్ ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ సినిమాల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది.
ఈ మొత్తం అమీర్ ఖాన్ యొక్క ‘దంగల్’ ఓపెనింగ్స్ కన్నా ఎక్కువే. ‘దంగల్’ చైనాలో మొదటి రోజు 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ రికార్డ్ కలెక్షన్లతో బాహుబలి-2 యొక్క ప్రపంచవ్యాప్త వసూళ్లు మరింతగా పెరిగనున్నాయి. ఇక ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత మెరుగ్గా ఉండే అవకాశముంది.


