చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్ ?

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్ ?

Published on May 5, 2018 11:09 AM IST

హీరో గోపీచంద్ నటించిన చిత్రాల్లో ‘ఒక్కడున్నాడు, సాహసం’ వంటివి ప్రశంసలతో పాటు మంచి విజయాన్ని కూడ దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాల్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. చివరగా ‘మనమంతా’ అనే సినిమాను చేసిన ఈ దర్శకుడు మరోసారి గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇప్పటికే ఆయన కథను సిద్ధం చేసి గోపీచంద్ కు చెప్పారని, ఆయన కూడ కలిసి పనిచేయడం పట్ల సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ కాంబో ముచ్చటగా మూడోసారి వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సిందే. యకపోతే గోపీచంద్ ప్రస్తుతం నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో ‘పంతం’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు