వరుస సినిమాలతో మరింత వేడెక్కనున్న వేసవి !

వరుస సినిమాలతో మరింత వేడెక్కనున్న వేసవి !

Published on May 5, 2018 3:18 PM IST

ఈ వేసవి సినీ ప్రియులకు మంచి వినోదాన్ని అందివ్వనుంది. ఇప్పటికే గత నెల రోజుల వ్యవధిలో పెద్ద సినిమాలైన ‘రంగస్థలం, భరత్ అనే నేను’ లాంటి సినిమాలు విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తుండగా నిన్న అల్లు అర్జున్ యొక్క ‘నా పేరు సూర్య’ విడుదలైంది. ఇలా మూడు పెద్ద సినిమాలు థియేటర్లో అలరిస్తుండగా రాబోయే నెల రోజుల్లో వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి.

ముందుగా మే 9న ‘మహానటి’, మే 11న ‘మెహబూబా’ చిత్రం విడుదలవుతుండగా ఆ తర్వాతి వారంలో ‘జంబ లకిడి పంబ’, విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రాలు రానున్నాయి. వాటి తరవాత మే నెల చివర్లో కళ్యాణ్ రామ్ యొక్క ‘నా నువ్వే’ మే 25న, అదే రోజున సీనియర్ స్టార్ హీరో నాగార్జున చేసిన ‘ఆఫీసర్’, మే 24న మరొక స్టార్ హీరో రవితేజ నటించిన ‘నేల టికెట్టు’ విడుదలవుతున్నాయి.

ఇలా భిన్నమైన జానర్లకు చెందిన సినిమాలు వరుసగా థియేటర్లలోకి దిగుతుండటంతో ఈ వేసవి సినీ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందివ్వనుంది.

తాజా వార్తలు