
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘మహానటి’ కూడ ఒకటి. సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై సప్న దత్, ప్రియాంక దత్ లుక్ నిర్మించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ చేయగా సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి వారంతా ప్రముఖ పాత్రల్లో నటించారు.
సావిత్రిగారి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించాలనే ఈ సినిమాను తీశామని చెబుతున్న నిర్మాతలు చిత్రం మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్లేందుకు మంచి స్థాయిలో ప్రమోషన్లను చేస్తున్నారు. నటి కీర్తి సురేష్ ఈరోజు ప్రమోషన్లలో పాల్గొంటుండగా ఇతర నటీ నటులు కూడ త్వరలోనే తమ వంతు ప్రచారాల్ని మొదలుపెట్టనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు టీమ్ హీరో నాని ద్వారా ప్రేక్షకులకు ఒక సప్రైజ్ ఇవ్వనుంది.
మీక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు కొద్దిరోజుల క్రితమే విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. మంచి బడ్జెట్ కేటాయించి నిర్మించిన ఈ చిత్రం తమ కెరీర్లో ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

