మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. తొలిసారి చరణ్, బోయపాటి కలసి చేస్తున్న చిత్రం ఇది. సాదరణంగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజున క్రియేట్ అయిన క్రేజ్ కన్నా ఇప్పుడున్న క్రేజ్ రెట్టింపుగా కనిపిస్తోంది. అందుకు కారణం చరణ్ చివరి చిత్ర్రం ‘రంగస్థలం’ సాధించిన విజయమనే చెప్పాలి.
బోయపాటి సినిమా లాంచ్ జరగడానికి, షూటింగ్ మొదలుపెట్టడానికి మధ్యలో విడుదలైన ‘రంగస్థలం’ అఖండ విజయాన్ని అందుకుని రూ. 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అంతేగాక ఈ చిత్రంతో చరణ్ లోని అద్భుతమైన నటుడు పూర్తిస్థాయిలో ఆవిష్కృతమయ్యాడు. ఈ సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు రాబోయే సినిమాల్లో కూడ చరణ్ నటన ఇదే స్థాయిలో ఉండేలా పాత్రల్ని, సన్నివేశాల్ని డిజైన్ చేసుకుంటే సక్సెస్ ఖాయమని అభిప్రాయాపడుతున్నారు.
అంతేగాక సాధారణంగానే తన హీరోల్లోని నటనను, ఛరీష్మాను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దర్శకుడు బోయపాటి ఈసారి చరణ్ ను ‘రంగస్థలం’ సినిమాలో కంటే ఒకింత ఎక్కువగానే చూపుతారని, చూపాల్సిందేనని అనుకుంటున్నారు. ఈ అంచనాలతో బోయపాటిపై సినిమా అనౌన్స్ చేసినప్పుడున్న భాద్యత రెట్టింపైందనే చెప్పాలి. కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్యగారు నిర్మిస్తున్నారు.


