వాయిదాపడిన రాజ్ తరుణ్ సినిమా !

వాయిదాపడిన రాజ్ తరుణ్ సినిమా !

Published on May 5, 2018 4:33 PM IST

చివరగా ‘రంగుల రాట్నం’ చిత్రంతో మన ముందుకొచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ చేసిన కొత్త చిత్రం ‘రాజుగాడు’ అన్ని పనుల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ముందుగా ఈ చిత్రాన్ని మే 11న రిలీజ్ చేయాలని అనుకున్నా కొన్ని కారణాల వలన ఆ తేదీని జూన్ 1కి వాయిదావేశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే రాజ్ తరుణ్ స్వయంగా తెలిపారు.

నూతన దర్శకురాలు సంజన రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడిగా అమైరా దస్తూర్ నటించగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ దొంతనం చేసే లోపం ఉన్న కుర్రాడిగా కనిపించనున్నాడు. చాలా రోజుల క్రితమే విడుదలైన ఈ చిత్ర టీజర్ బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో కొంత పాజిటివ్ అభిప్రాయమే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు