‘నా పేరు సూర్య’ మొదటి రోజు యూఎస్ వసూళ్లు !

‘నా పేరు సూర్య’ మొదటి రోజు యూఎస్ వసూళ్లు !

Published on May 5, 2018 4:24 PM IST


వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బన్నీ సోల్జర్ పాత్రలో నటించడం, ఆరంభం నుండి చిత్రంపై ఉన్న క్రేజ్ మూలాన తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ ఓపెనింగ్ బన్నీ కెరీర్లోనే ఉత్తమమైన ఓపెనింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

ఇక ఓవర్సీస్ విషయానికొస్తే విడుదల ముందురోజు రాత్రి ప్రీమియర్ల ద్వారా 2.2 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా మొదటిరోజు వసూళ్లను కూడ కలిపితే 194 లొకేషన్ల నుండి 3.79 లక్షల డాలర్లను వసూలు చేసింది. ఇంకా కొన్ని స్క్రీన్ల వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం యొక్క కలెక్షన్ల తాజా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 123తెలుగు.కామ్ ను ఫాలో అవ్వండి.

తాజా వార్తలు