భరత్ అనే నేను కొత్త సీన్స్ కోసం అభిమానులు వెయిటింగ్!

భరత్ అనే నేను కొత్త సీన్స్ కోసం అభిమానులు వెయిటింగ్!

Published on May 6, 2018 9:36 AM IST

మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా మంచి టాక్ తో కలెక్షన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో ఒక మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రంగా భరత్ అనే నేను నిలిచింది. రికార్డు స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా కలెక్షన్స్ మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో అభిమానుల కోరిక మేరకు మరికొన్ని మంచి సీన్స్ ను యాడ్ చేయబోతున్నారు.

విద్యాసంస్థల నిర్వహకులతో మహేష్ బాబు చర్చించడం అలాగే రైతు మరియు గర్భిణితో సంభాషణకు సంబందించిన సన్నివేశాలను త్వరలో సినిమాలో కనిపించనున్నాయి. యూ ట్యూబ్ లో ఇప్పటికే ఆ సీన్స్ కు మంచి ఆధారం అందుతోంది. రన్ టైమ్ ఎక్కువవ్వడం వలన వీటిని కట్ చేశారు. ఇప్పుడు మహేష్ అభిమానులు ఆ సీన్స్ కోసం మరోసారి సినిమా చూడటానికి రెడీగా ఉన్నారు. మహేష్ సరసన కైరా అద్వానీ నటించిన ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు