టాలీవుడ్ కింగ్ నాగార్జున జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ఆఫీసర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని తో చేస్తోన్న మల్టీస్టారర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ రీసెంట్ గా ఒక డిఫెరెంట్ సినిమాలో కీలక పాత్రకు ఓకే చేశాడట. అది కూడా ఒక మలయాళ సినిమాకు అని తెలుస్తోంది.
సీనియర్ డైరక్టర్ ప్రియదర్శన్ – కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కాంబినేషన్ లో మరాక్కర్: అరబికాడాలింటే సింహం అనే సినిమా రూపొందనుంది. త్వరలోనే సినిమాను స్టార్ట్ చేయాలనీ దర్శకుడు ప్లాన్స్ వేస్తున్నాడు. అయితే ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు నాగార్జునని ఫైనల్ చేశారట. అలాగే మరో మెయిన్ క్యారక్టర్ కోసం బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఈ న్యూస్ వెలువడనుంది.


