షారుక్ సినిమాలో మాధవన్ !

షారుక్ సినిమాలో మాధవన్ !

Published on May 8, 2018 9:02 AM IST

దక్షిణాది నటుడు మాధవన్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆసక్తికరమైన సినిమాల్ని ఎంచుకుంటూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని రుచి చూపిస్తున్నారు. ఈ మధ్యే నాగ చైతన్య యొక్క ‘సవ్యసాచి’ చిత్రంలో నటించిన ఆయన ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జీరో’ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్, మాధవన్ మంచి సన్నిహితులు. ఆనంద్ ఎల్. రాయ్ కు మాధవన్ ఫెవరెట్ నటుడు కూడ. అందుకే ఈ సినిమాలో మాధవన్ చేత చిన్నదే అయినా ఆసక్తికరమైన పాత్రను చేయిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్ ఒక పాటలో నటించగా ఆయనతో పాటు శ్రీదేవి, రాణి ముఖర్జీ, కాజోల్, కరిష్మా కపూర్, అలియా భట్ లాంటి స్టార్ నటీమణులు ఆ పాటలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు