అమెరికాలో ‘మహానటి’ సందడి !

అమెరికాలో ‘మహానటి’ సందడి !

Published on May 8, 2018 1:29 PM IST

తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహానటి’ చిత్ర రేపే విడుదలకానుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి స్థాయిలో విడుదలకానున్న ఈ చిత్రం ఓవర్సీస్లో కూడ మంచి రిలీజ్ పొందనుంది. సుమారు 150 కి పైగా లొకేషన్లలో ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు.

సినిమా గనుక అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందగలిగితే వసూళ్లు కూడ మంచి స్థాయిలోనే ఉండే అవకాశముంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేయగా సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య వంటి వాళ్ళు ముఖ్య పాత్రలు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు