‘నా పేరు సూర్య’ను మించిపోయిన ‘మహానటి’ !

‘నా పేరు సూర్య’ను మించిపోయిన ‘మహానటి’ !

Published on May 9, 2018 5:25 PM IST

మంచి అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది ‘మహానటి’ చిత్రం. నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ఓవర్సీస్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఎక్కువగానే ఉండటం, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ సంఖ్యలోనే ప్రీమియర్లు వేయడంతో ప్రీమియర్ వసూలు 3.03 లక్షల డాలర్ల వరకు వసూలయ్యాయి. ప్రీమియర్ల ద్వారా పాజిటివ్ టాక్ రావడంతో ఈ వసూళ్లు ఇలాగే స్టడీగా కొనసాగే అవకాశాముంది.

ఇకపోతే ఈ మొత్తం ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ యొక్క ‘నా పేరు సూర్య’ కంటే ఎక్కువ కావడం విశేషం. ‘నా పేరు సూర్య’ ప్రీమియర్ల ద్వారా కేవలం 2.07 లక్షల డాలర్లను మాత్రమే కెలెక్ట్ చేయగలిగింది. అంతేగాక ఈ ఏడాది యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ‘అజ్ఞాతవాసి, రంగస్థలం, భరత్ అనే నేను’ చిత్రాల తర్వాతి స్థానాన్ని ‘మహానటి’ ఆక్రమించడం విశేషం.

తాజా వార్తలు