హాఫ్ మిలియన్ దిశగా ‘మహానటి’ !

హాఫ్ మిలియన్ దిశగా ‘మహానటి’ !

Published on May 10, 2018 8:34 AM IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం ‘మహానటి’. అలనాటి నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది. ఓవర్సీస్లో అయితే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పడుతున్నారు.

ప్రీమీయర్ల ద్వారా 3.03 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా బుధవారం రాత్రి 10గంటల వరకు 4.56 లక్షల డాలర్లను రాబట్టింది. బుధవారం నాటి పూర్తి వసూళ్లను కలిపితే ఈ మొత్తం హాఫ్ మిలియన్ దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించిన ఈ చిత్రంలో సమంత, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి నటులు పలు కీలక పాత్రల్ని పోషించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు