
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘రంగుల రాట్నం’ చిత్రం పెద్దగా సక్సెస్ ఇవ్వకపోవడంతో యువ హీరో రాజ్ తరుణ్ ఈసారి చేసిన ‘రాజుగాడు’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. చిత్రీకరణ పూర్తై చాలా రోజులు అయినా కొని అనివార్య కారణాల వలన వాయిదాపడిన ఈ సినిమా జూన్ 1వ తేదీన రిలీజ్ కానుంది.
ఇది వరకే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించగా ట్రైలర్ ను రేపు 11వ తేదీ సాయంత్రం 5గంటలకు విడుదలచేయనున్నారు. సంజన రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడిగా అమైరా దస్తూర్ నటించగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మించారు.

