వినాయక్ సినిమాను మొదలుపెట్టనున్న బాలక్రిష్ణ !

వినాయక్ సినిమాను మొదలుపెట్టనున్న బాలక్రిష్ణ !

Published on May 10, 2018 5:09 PM IST

నందమూరి బాలక్రిష్ణ వివి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారని కొద్దీ నెలల క్రితమే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే మొదలుపెట్టిన ‘ఎన్టీఆర్’ సినిమా ఆలస్యమయ్యేలా ఉండటంతో బాలక్రిష్ణ ఈ గ్యాప్లో వినాయక్ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.

ఈ నెల 27న హైదరాబాద్లో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేగాక సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నారని కూడ తెలుస్తోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి బాలయ్య, వినాయక్, సి.కళ్యాణ్ ల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తాజా వార్తలు