ఒక కొడుకుగా అసూయపడుతున్నాను – నాగార్జున !

ఒక కొడుకుగా అసూయపడుతున్నాను – నాగార్జున !

Published on May 10, 2018 6:00 PM IST

నాగ చైతన్య మీద నాగార్జున ప్రశంసలు కురిపించారు. ‘మహానటి’ విడుదలై ఘనవిజయం దిశగా దూసుకెళుతోంది. ఆ సినిమాలో నాగ చైతన్య వాళ్ళ తాతగారు అక్కినేని నాగేశ్వర రావు గారి పాత్రలో నటించారు. ఇప్పుడు ఆ పాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి నాగార్జున ట్విట్టర్ లో ఒక తండ్రిగా చాలా గర్వ పడుతున్నాను అలాగే ఒక కొడుకుగా కొంచం అసూయ కూడా ఉంది. ఎందుకంటే నేను మా నాన్నగారి పాత్రలో ఎప్పుడు నటించలేదు. చైతన్య నాన్న గారి పాత్రలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఇక నిన్నవిడుదలైన ‘మహానటి’ సినిమా అందరితో ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో మహానటి సావిత్రిగారి క్యారెక్టర్ చేసిన కీర్తి సురేష్ ఫై పొగడ్తల వర్షం కురుస్తోంది. సినిమా చూస్తున్నంత సేపు సావిత్రి గారే కన్పించారు అని ఆ పాత్రకి కీర్తిని తప్ప వేరే వారిని ఊహించలేమని ప్రేక్షకులు అంటున్నారు. ‘మహానటి’ చిత్రం ఓవర్సీస్లో కూడా హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు