
‘మహానటి’ ఈ సినిమాని పొగడని వారు లేరు. తాజాగ ఈ జాబితాలో మాజీ ఐఏఎస్ అధికారి ‘లోక్ సత్తా’ పార్టీ అధినేత ‘జయప్రకాష్ నారాయణ’ కూడా చేరిపోయారు. ‘మహానటి’ సినిమా చూశానని సావిత్రిగారి జీవిత చరిత్రను ప్రేమపూర్వకంగా అద్భుతంగా తీసారని ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు ,సాంకేతిక నిపుణలు , డైరెక్టర్ , ప్రొడ్యూసర్స్ వారి పనిని అద్భుతంగా చేసారని ‘మహానటి’ సినిమా ఒక గొప్ప నటి జీవితాన్ని మన ముందుకు తీసుకొచ్చిందని కన్నీళ్ళు ఆపుకోవడం చాలా కష్టమైందని అయన అన్నారు.
‘మహానటి’ ఇలా ప్రశంసల్లోనే కాదు కలెక్షన్లలో కూడ దూసుకెళ్లిపోతోంది. ఈ సినిమాకి ప్రతి ఒక్కరి దగ్గరి నుండి పాజిటివ్ టాక్ రావడం వలన సినిమాకు ప్లస్ అయింది. అలాగే మహానటి ఈ రోజు తమిళనాట కూడా రిలీజ్ అయింది. మరి అక్కడి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా వైజయంతి మూవీస్ వారు నాగ్ అశ్విన్ ను నమ్మి మహానటి సినిమా తీసినందుకు వారికి మంచి ప్రతిఫలమే దక్కింది. ఇది వారి బ్యానర్లో మరుపురాని సినిమాగా నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు .

