డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా ‘మెహబూబా’. పూరి కుమారుడు ఆకాష్ పూరి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదలచేశారు. ఓవర్సీస్లో అయితే ప్రీమియర్ల రూపంలో కూడ చిత్రాన్ని ప్రదర్శించారు.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు 81 లొకేషన్ల నుండి 41,923 డాలర్లను ఈ చిత్రం వసూలు చేసింది. ఈ ప్రీమియర్లకు పూరి జగన్నాథ్ ఆకాష్ పూరి, నేహా శెట్టిలు హాజరయ్యారు. ఇక ఈరోజు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితమైన మొదటి షోల నుండి సినిమాకు గొప్ప ఫీడ్ బ్యాక్ అయితే అందలేదు. మరి వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఈ వీకెండ్ తో తేలనుంది.


