మహానటి సినిమాఫై పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే రాజమౌళి, రాఘవేంద్రరావు లాంటి చాలా మంది ప్రముఖులు ‘మహానటి’ సినిమా చూసి వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగా తాజాగా సినిమా చూసిన ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ ‘మహానటి’ సినిమాఫై ప్రశంసలు కురిపించారు.
‘మహానటి’లో సావిత్రి గారి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందని బహుశా సావిత్రి గారే కీర్తితో ఆలా నటింపచేశారని, ‘మహానటి’ లాంటి ఒక గొప్ప చిత్రాన్ని తీసినందుకు చిత్ర దర్శుకుడ్ని అలాగే నిర్మాతలను మరియు చిత్రంలో నటించిన దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలను అభినందించారు. అలాగే ‘మహానటి’ చిత్రం సావిత్రి గారికి ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.


