
సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తాజా చిత్రం ‘ఆఫీసర్’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ యొక్క ట్రైలర్ ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదలకానుంది. ఇందులో నాగ్ పోలీసాఫీసర్ పాత్రను చేయడం జరిగింది. ఈ పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఇందులో నాది ముక్కుసూటిగా, నిజాయితీ ఉంటూ నమ్ముకున్న నిజం కోసం పోరాడే ఆఫీసర్ పాత్ర అన్నారు.
వర్మ మాట్లాడుతూ ఈ సినిమాను నేను మనసు పెట్టి తీయలేదు, మైండ్ పెట్టి తీశాను. ఇదొక రియలిస్టిక్ యాక్షన్ మూవీ. ఒక ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా చేశాను అన్నారు. వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై నిర్మించిన ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా కనిపించనుంది. నాగార్జున, వర్మల హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు కూడ మంచి స్థాయిలోనే ఉన్నాయి. మే 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

