చైనాలో 10 మిలియన్లు తాకిన ‘బాహుబలి-2’ వసూళ్లు !

చైనాలో 10 మిలియన్లు తాకిన ‘బాహుబలి-2’ వసూళ్లు !

Published on May 12, 2018 11:40 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం ‘బాహుబలి-2’ చైనాలో ఈ నెల 4వ తేదీన ఏడిద ఎత్తున విడుదలైంది. మొదటి వారాంతంలోనే మిలియన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాతి రోజుల్లో 3 మిలియన్లను వసూలుచేసి ఇప్పటి వరకు 10 మిలియన్ డాలర్లను ఖాతాలో వేసుకుంది.

చైనాలో విడుదలైన ఇతర భారతీయ సినిమాల వసూళ్లతో పోలిస్తే ఇది భారీ మొత్తం కాకపోయినా తెలుగు సినిమా మార్కెట్ స్థాయి విస్తరించింది అనడానికి నిదర్శనంగా నిలిచి జాతీయస్థాయి సినిమాలను నిర్మించాలనుకునే నిర్మాతలకు ప్రోత్సాహకంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద చైనాలో ఫుల్ రన్ ముగిసే నాటికి ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ ను అందుకునే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు