మరో స్టార్ హీరో సరసన ‘మళ్ళీ రావా’ హీరోయిన్ !

మరో స్టార్ హీరో సరసన ‘మళ్ళీ రావా’ హీరోయిన్ !

Published on May 14, 2018 1:17 PM IST

‘మళ్ళీ రావా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ‘ఆకాంక్ష సింగ్’ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ‘మళ్ళీ రావా’ సినిమాలో ఆమె నటనకుగాను ఇంప్రెస్ అయిన శ్రీరామ్ ఆదిత్య తన మల్టీస్టారర్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరో నాగార్జునకు జోడిగా ఆమెను సెలెక్ట్ చేసుకోగా ఇప్పుడు మరొక స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఆకాంక్ష సింగ్.

ఆ హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో సుదీప్. సుదీప్ హీరోగా తెరకెక్కనున్న ‘పహిల్వాన్’ అనే సినిమాలో ఆకాంక్ష సింగ్ కథానాయకిగా నటించనుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను మే 17వ తేదీ నుండి మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు