ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది – అశ్వినీ దత్ !

ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది – అశ్వినీ దత్ !

Published on May 14, 2018 1:28 PM IST

‘మహానటి’తో తిరుగులేని విజయాన్ని అందుకుంది చిత్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతి మూవీస్’. గతంలో తెలుగు ఇండస్ట్రీకి అనేక మంచి చిత్రాలను అందించిన వైజయంతి మూవీస్ గత కొంత కాలంగా నెమ్మదించి మళ్ళీ ఇప్పుడు ‘మహానటి’ సినిమాతో విజయాల బాట పట్టింది. ఇకపై సంస్థ ద్వారా వరుసగా సినిమాలను నిర్మించాలని అశ్వినీ దత్ భావిస్తున్నారు.

ఈ విషయంపైనే తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక నుండి మా బ్యానర్లో వరుసగా సినిమాలు నిర్మిస్తామని ప్రస్తుతం మహేష్ బాబు తో చేయబోయే సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని, త్వరలోనే ఆ చిత్రం ప్రారంభమవుతుందని, దర్శకుడు ఎవరనేది ఈ నెలాఖరులో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించంనున్నారు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన అశ్వినీ దత్ సినిమా చేసే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు