
కొన్ని రోజుల క్రితమే ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన హీరో నితిన్ ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా చేస్తున్నారు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని జూలై చివరి వారంలో విడుదల చేయాలనుకున్నారు దిల్ రాజు.
కానీ ఇప్పుడు తన నిర్మాణంలోనే రూపొందిన ‘లవర్స్’ జూలైలోనే వస్తుండటంతో ఆగష్టు నెలైతే అన్ని విధాలా బాగుంటుందని ఆ నెలలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రాశీఖన్నా, నందిత శ్వేతలు నటిస్తున్నారు. ఇటీవలే ‘మహానటి’ చిత్రంతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

